Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు నచ్చిన హీరోయిన్ సౌందర్య .. ఆ హీరోయిన్లు మాత్రం ఇబ్బంది పెట్టేశారు: దర్శకుడు సాగర్

  • సౌందర్య చాలా మంచి అమ్మాయి 
  • ఆమెతో నాలుగైదు సినిమాలు చేశాను 
  • నగ్మా .. హీరా ఇబ్బంది పెట్టేశారు
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా సాగర్ కి మంచి ఇమేజ్ వుంది. ఎంతోమంది స్టార్ హీరోలతో .. హీరోయిన్లతో ఆయన సినిమాలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "సౌందర్య చాలా మంచి అమ్మాయి. ఒక సీన్ ఎలా చేయాలో చెబితే, అంతకన్నా బాగా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇతర విషయాల్లో ఆమె ఎంతమాత్రం జోక్యం చేసుకోదు. సౌందర్యంతో నేను 'అమ్మదొంగ' .. 'అమ్మ నా కోడలా' .. 'ఓసి నా మరదలా' మొదలైన సినిమాలు చేశాను.

ఇక నాకు బాగా కోపాన్ని తెప్పించిన హీరోయిన్లు నగ్మా .. హీరా. ఇద్దరూ కూడా షూటింగుకి సహకరించకుండా చాలా ఇబ్బంది పెట్టేశారు. ఎంతగా నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో అప్పట్లో ఆ ఇద్దరిపై చాలా కోపం వచ్చేసింది. ఒకానొక దశలో ఆ సినిమాలు వదిలేయాలనుకున్నాను కూడా" అని చెప్పుకొచ్చారు. 
sagar

More Telugu News